క్రైమ్/లీగల్

హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పని చేస్తున్న అర్చకుల వయస్సు 65 ఏళ్లు దాటితే పదవీవిరమణగా పరిగణించడాన్ని ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. టీడీడీ పాలక మండలి ఇచ్చిన అదేశాలు చెల్లవని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. గురువారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎస్ రామచంద్రరావుసంబంధిత పిటిషన్లపై విచారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దిగవంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకొచ్చిన 33/2007 చట్టప్రకారం టీటీడీ అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వం చేసే హక్కు ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు పట్ల అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. టీడీడీ పాలక మండలి తనను అర్చకత్వం నుంచి బలవంతంగా పదవీవిరమణ చేయించిందని రమణదీక్షితులు బహిరంగంగానే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.