క్రైమ్/లీగల్

సమాచార కమిషనర్ల ఖాళీలు భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా వివిధ రాష్ట్రాల్లోని సమాచార కమిషనర్ల ఖాళీలను వెంటనే భర్తీచేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సమాచార కమిషనర్‌సహా ఇతర కమిషనర్లను భర్తీ చేయడం లేదని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తులు ఏకే సిక్రీ,అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ తరపు న్యాయవాది గుంటూర్ ప్రభాకర్ ఆంధ్రాలో ప్రధాన కమిషనర్‌తోపాటు సహాయ కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కోర్టుకు తెలిపారు. దీనిపై అఫిడవిట్ రూపంలో దాఖలు చేయమని ధర్మాసనం తెలిపింది. అలాగే తెలంగాణ తరపున అఫిడవిడ్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు కావాలని ఆ రాష్ట్ర తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దానికి అనుమతినిచ్చిన ధర్మాసనం విచారణను వచ్చే ఎడాది జనవరి 22కి వాయిదా వేసింది.