క్రైమ్/లీగల్

రాచకొండలో చిరుత, హైనాల స్వైరవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, డిసెంబర్ 14: రాచకొండ అడవుల్లో చిరుతలు, హైనాలు సంచరిస్తూ కనిపించిన గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలను చంపుతుండటంతో గిరిజనులు, యాదవులు, ఇతర రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శుక్రవారం రాచకొండ గుట్టల్లోని తూంబావి తండాకు చెందిన కాట్రోతు కిషన్‌కు చెందిన పెద్దమేకను బూర్గుచెట్టుగుట్ట వద్ద చిరుత చంపితినేసింది. గత వారం క్రితం వెంకంబావితండాకు చెందిన హరియ, మంగులకు చెందిన 7 గొర్రెలను చంపితిన్నాయి. రాచకొండకు చెందిన ఐదుదోనల తండా, కడీలబావి తండా, ఆరుట్ల, సంస్థాన్‌నారాయణపురం గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు, కాపరులకు చెందిన గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులను చంపేశాయి. చిరుత, హైనాల దాడుల వల్ల పేద రైతులు, కాపరులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
రోజురోజుకూ చిరుత, హైనాల దాడులతో గొర్రెల, మేకల కాపరులు వాటి అమ్ముకుంటున్నారు. గత సంవత్సరం కాలంగా రాచకొండ అడవుల్లో చిరుతలు, హైనాలు సంచరిస్తున్నాయి. ఇప్పటికే పదుల పదుల సంఖ్యలో మేకలు, గొర్రెలను బలిచేసుకున్న కాపరులు తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.