క్రైమ్/లీగల్

నిషిద్ధ విదేశీ సిగరెట్ల దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: నిషేధిత విదేశీ సిగరెట్ల వ్యాపారిని టాస్క్ఫోర్స్, ఐటీసీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా చేస్తూ విజయవాడలోని ఓ గోడౌన్‌లో పెద్దఎతున్త ఉంచిన నిల్వలను దాడి చేసి పట్టుకున్నారు. విక్రేతను అరెస్టు చేసి సుమారు 15లక్షల రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ముందు హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భావానీపురం ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులో నివాసముంటున్న కాకుమాను గోపి గత కొంతకాలంగా ప్రభుత్వ అనుమతి లేని విదేశీ సిగరెట్లు ప్యారీస్, బ్లాక్‌గోల్డ్, విన్ తదితర బ్రాండ్ల ప్యాకెట్లను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. హైదరాబాద్‌కు చెందిన హాసన్ అనే వ్యక్తి ద్వారా ఈ సరుకును రవాణా చేస్తున్నాడు. పెద్దఎత్తున సరుకును సత్యనారాయణపురం, గాంధీనగర్ సత్యనారాయణ స్వామి గుడి సమీపంలోని ఓ ఇంటిని గోడౌన్‌గా మార్చుకుని నిల్వ ఉంచారు. ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు టాటా మ్యాజిక్ వాహనంలో చేరవేస్తూ నల్లబజారులో విక్రయాలు సాగిస్తూ, అక్రమంగా సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ విదేశీ సిగరెట్లకు ఎలాంటి జీఎస్టీ చెల్లింపులు లేకపోవడంతోపాటు పూర్తి నాసిరకం సరుకుగా గుర్తించారు. పక్కా సమాచారంతో పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్, సీఐ రాయి సురేష్‌రెడ్డి బృందం, ఐటీసీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించి వ్యాపారి గోపిని అరెస్టు చేశారు. గోడౌన్ నుంచి సుమారు 15లక్షలు రూపాయల విలువైన ప్యారీస్, బ్లాక్‌గోల్డ్, విన్ వంటి నిషేధిత బ్రాండ్ల సిగరెట్లుతో పాటు గుట్కా ప్యాకెట్లు, టాటా మ్యాజిక్ వాహనం, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.