క్రైమ్/లీగల్

పాండురంగస్వామి ఆలయ ఈవో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 15: మనస్థాపంతో పాండురంగస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ బీచ్ రోడ్డులో శనివారం కలకలం సృష్టించింది. పెందుర్తిలోని కృష్ణరాయపురంలో నివాసముంటున్న కొప్పిశెట్టి నాగేశ్వరరావు బీచ్‌రోడ్డులోని పాండురంగస్వామి గుడి, పినగాడిలోని శివాలయానికి కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా పినగాడిలోని ఆలయం అర్చకుని భార్యతో ఫోన్‌లో నాగేశ్వరరావు అసభ్యకరంగా మాట్లాడి వేధించినట్టు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తికి ఫిర్యాదు అందడంతో అతనిని శుక్రవారం సస్పెండ్ చేసినట్టు తెలిసింది. ఈ తరుణంలో మనస్థాపానికి గురైన నాగేశ్వరరావు శనివారం ఉదయం బీచ్‌రోడ్డులోని పాండురంగస్వామి ఆలయంలోని తన కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాను ఏ తప్పూ చేయలేదని, తన భార్య, పిల్లలు మంచివారని, తన కుమారునికి ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మృతుని వద్ద దొరికిన సూసైడ్ నోటులో నాగేశ్వరరావు పేర్కొని ఉండడాన్ని పోలీసులు గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీఐ ఇమ్మాన్యుల్‌రాజు నేతృత్వంలో మూడో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.