క్రైమ్/లీగల్

రాఫెల్ జెట్స్ కొనుగోళ్ల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: రాఫెల్ జెట్ కొనుగోళ్లపై ఇచ్చిన తీర్పులో కాగ్, నివేదిక, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ప్రస్తావించిన అంశాల్లో దొర్లిన తప్పులను సరిదిద్ది తీర్పును సవరించాలని కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీర్పులో పొరపాటున దొర్లిన దోషాల వల్ల వివాదాలు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. తీర్పులోని 25వ పేరాలో రెండు వాక్యాలు తాము సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రస్తావించారన్నారు. తాము అన్ని వివరాలను సీల్డ్ కవర్‌లో ఇచ్చామన్నారు. ఇందులో రాఫెల్ జెట్ ధరలను కూడా ప్రస్తావించామన్నారు. కాని కోర్టు తీర్పులో పేర్కొన్న వాక్యాల వల్ల వేరే అర్థం వస్తోందన్నారు. కాగ్ ఇచ్చిన నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇచ్చినట్లు, పరిశీలించినట్లు ఉందని కేంద్రం పేర్కొంది. తాము అలా పేర్కొనలేదని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. కాగ్‌తో రాఫెల్ ధర వివరాలను సమర్పించామని మాత్రమే పేర్కొన్నామని, ఈ అంశం ముమ్మాటికీ నిజమన్నారు. కాగా కాగ్ నివేదికను ఎటూ పబ్లిక్ అకౌంట్స్‌కమిటీ పరిశీలిస్తుందని, ఈప్రక్రియ మొత్తాన్ని తాము సీల్ట్‌కవర్‌లో అపస్తావించామని కేంద్రం కోర్టుకు తెలిపింది. సాధారణ విధానంలో జరిగే ప్రక్రియను తెలియచేశామన్నారు. కాని తీర్పులో కాగ్ నివేదిక ఇచ్చినట్లు, దీనిని పబ్లిక్ అకౌంట్స్‌కమిటీ పరిశీలించినట్లు ఉందన్నారు. దీని వల్ల అపోహలు తొలగించేందుకు సుప్రీంకోర్టు తీర్పును సరిదిద్దాలని కేంద్రం కోరింది. సుప్రీంకోర్టు రాఫెల్ ఒప్పందంపై తీర్పును శుక్రవారం వెలువరించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. కాగ్ నివేదిక ఇవ్వలేదని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించలేదని, కాని కోర్టును కేంద్రం తప్పుదోవబట్టించిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.