క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో గుంటూరు జిల్లా రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: సొసైటీ రిజిస్ట్రేషన్‌కు లంచం డిమాండ్ చేసిన గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గుంటూరు పొట్టి శ్రీరాములు నగర్‌కు చెందిన గోళ్ల శివశంకర్ మాస్టర్ ప్రింటింగ్ బిల్లింగ్ సొసైటీ పేరుతో సొసైటీ నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు. ఈ సమయంలో సొసైటీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి గత నెల రోజులుగా జిల్లా రిజిస్ట్రారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే జిల్లా రిజిస్ట్రార్ పీ రామకృష్ణ ఇందుకోసం శివశంకర్ నుండి 10 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే తాను అంత ఇవ్వలేనని చెప్పడంతో ఇద్దరి మధ్య చివరకు 7 వేల రూపాయలకు బేరం కుదిరింది. రిజిస్ట్రార్ తన ప్రైవేటు ఉద్యోగి శివరామకృష్ణ చేతికి డబ్బులు ఇవ్వాలని శివశంకర్‌కు చెప్పాడు. దీనిపై శివశంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగి శివరామకృష్ణకు 7 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అడిషనల్ ఎస్‌పి సురేష్‌బాబు నేతృత్వంలో వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్ రామకృష్ణ ఆధ్వర్యంలోనే ఈ లంచం తతంగమంతా నడిచిందని ఏసీబీ అధికారులు ఆధారాలతో గుర్తించారు. జిల్లా రిజిస్ట్రార్‌పై కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ ఏఎస్‌పీ సురేష్‌బాబు వెల్లడించారు. ప్రజలు ఎవరైనా ఉద్యోగులు, అధికారులు లంచం కోసం వేధిస్తుంటే తమను సంప్రదించాలని సురేష్‌బాబు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు శ్రీ్ధర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.