క్రైమ్/లీగల్

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజీపేట, డిసెంబర్ 17: వివిధ రైళ్లలో బంగారం, నగదు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను కాజీపేట ప్రభుత్వ రైల్వే పోలీసులు పట్టుకున్నారు..బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా నుంచి రూ.7,54,480 విలువ చేసే బంగారు ఆభరణాలను, 30వేల నగదును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. ప్రభుత్వ రైల్వే ఎస్పీ (సికింద్రాబాద్) అశోక్‌కుమార్ సోమవారం కాజీపేట జీఆర్పీ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దొంగతనం ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జీఆర్పీ ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ కాజీపేట, మంచిర్యాల, వరంగల్ రైల్వే స్టేషన్ల పరిధిలోని రైళ్లలో గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పలు దొంగతనాలు జరిగాయన్నారు. ఈ దొంగతనాలపై జీఆర్ఫీ, ఆర్‌పీఎఫ్ సిబ్బందిని నిఘా పెట్టామన్నారు. ఆదివారం రాత్రి తమ ఆదేశాల మేరకు కాజీపేట రైల్వే స్టేషన్‌లో కాపలా కాస్తున్న జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బందికి అనుమానస్పదంగా అయిదుగురు వ్యక్తులు కనపడగా వారిని పట్టుకుని విచారించగా కాజీపేట, వరంగల్, మంచిర్యాల రైల్వేస్టేషన్‌ల్లో పరిధిలో 9చోట్ల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ వెల్లడించారు. దోపిడీ చేసిన సోత్తును వారి స్వగ్రామానికి తీసుకవెళుతుండగా పోలీసులకు పట్టుబడినట్లు ఆయన చెప్పారు. కాజీపేట రైల్వేపోలీసు స్టేషన్ పరిధిలో ఏడు దొంగతనాలు, వరంగల్‌లో ఒకటి, మంచిర్యాలలో ఒకటి మొత్తం తొమ్మిది దొంగతనాలకు ఈ ముఠా పాల్పడిందని తెలిపారు..దొంగతనాలకు పాల్పడినవారిలో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందినవారు కాగా, ఒకరు ఢిల్లీ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. దొంగతనాలకు పాల్పడినవారిలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి అసద్, ఎండి షానవాజ్, ఎండి సాకీర్ అలీమ్, ఎండి మోసిన్, ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ఇమ్రాన్ ఖురేషిలు ఉన్నారని వివరించారు. దొంగల ముఠా నుంచి 7లక్షల54వేల, 480 రూపాయల విలువ చేసే 226.4 గ్రాముల బంగారు ఆభరణాలను, 30వేల నగదను స్వాధీన పరుచుకున్నామని ఎస్పీ వెల్లడించారు. సుమారు 232 గ్రాముల బంగారాన్ని దోపిడీ చేయగా 226.4 గ్రాముల బంగారాన్ని పోలీసుల అప్రమత్తంతో రికవరీ చేయగలిగామని తెలిపారు. 65 వేల నగదును దోచుకోగా 30వేల నగదును రికవరీ చేసామన్నారు. దొంగతనాలకు పాల్పడిన ముఠాను పట్టుకున్న జీ ఆర్ఫీ పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విలేఖరుల సమావేశంలో జీఆర్పీ డీఎస్పీ విజయలాలా, సీఐ రాకేష్, ఎస్సై జితేందర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ విజయకుమార్, ఆర్‌ఫిఎఫ్ కాజీపేట ఇన్స్‌పెక్టర్ ఎ వీరన్న, ఎస్సై శ్రీనివాసరెడ్డి, జీఆర్పీ, ఆర్‌ఫిఎఫ్ కానిస్టేబుళ్లు హరి ప్రసాద్,శ్రీనివాస్, ఎండి తాయబ్‌అలీ, ఎన్ రాజ్‌కుమార్, సారయ్య, ఆదినారాయణలు పాల్గొన్నారు.