క్రైమ్/లీగల్
రోడ్డుప్రమాదంలో సఖీ టీం ఎఎస్సైకి తీవ్రగాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 December 2018
మార్కాపురం టౌన్, డిసెంబర్ 18: విధి నిర్వహణ కోసం వెళ్తున్న సఖీ టీం సభ్యులు ఉన్న ఆటో కొమరోలు వద్ద అదుపుతప్పి బోల్తాపడటంతో టీం సభ్యులకు స్వల్ప గాయాలు కాగా ఎఎస్సై ఆహారోన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఆరుగురు సిబ్బందితో ఆహారోన్ ఆటోలో విధులకు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. తీవ్రగాయాలకు గురైన ఆహారోన్‌ను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురంలోని కందుల ఓబులరెడ్డి వైద్యశాలకు తరలించారు. డిఎస్పీ రామాంజనేయులు, సిఐ శ్రీధర్‌రెడ్డి వైద్యశాలకు వెళ్లి ఆహారోన్‌ను, గాయపడిన సిబ్బందిని పరామర్శించారు.