క్రైమ్/లీగల్

బాసికా సంస్థపై కేసు రద్దుకు హైకోర్టు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఈజీ మూవీస్ బాసికా ఇన్ఫోటెక్ సంస్థపై కేసును రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సంస్థపైన 2009లో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాసికా ఇన్ఫోటెక్ సంస్థ తమ సంస్థపైన పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ బాలయోగి విచారించారు. నగరానికి చెందిన జిఎస్ నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు పైన పేర్కొన్న సంస్థపైన కేసును నమోదుచేశారు. 2009 మే 23వ తేదీన పైన పేర్కొన్న సంస్థ రూ.50 విలువైన టిక్కెట్‌ను రూ.58.02 పైసలకు విక్రయించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.