క్రైమ్/లీగల్

సుశీల్‌కుమార్ శర్మకు విముక్తి భార్య నైనాసహానీని హత్యకేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, డిసెంబర్ 21: భార్య నైనా సహానీని దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని తందూరీ చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న యువజన కాంగ్రెస్ మాజీ నేత సుశీల్ కుమార్ శర్మకు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. 1995లో చోటుచేసుకున్న ఈ దారుణ హత్యోదంతం కేసులో సుమారు రెండు దశాబ్ధాలుగా కారాగార వాసం అనుభవిస్తున్న సుశీల్‌కుమార్‌ను విడుదల చేయాల్సిందిగా జస్టిస్ సిద్ధార్థ్ మృధుల్, సంగీతా ధింగ్రా సెహగల్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. సుశీల్ కుమార్ శర్మ వయసు ప్రస్తుతం 56 సంవత్సరాలు. 1995లో అతను తన భార్య నైనా సహానీకి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను తుపాకీతో కాల్చిచంపాడు. తర్వాత మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా నరికి తర్వాత ఒక రెస్టారెంట్ ఓవెన్‌లో ఆ శరీర భాగాలను కాల్చి బూడిద చేసేందుకు విఫల యత్నం చేశాడు. ఈ క్రమంలో ఈ హత్యకేసు అప్పట్లో తందూరీ హత్య కేసుగా పెను సంచలనం రేపింది. అత్యంత క్లిష్టతరమైన ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరించేందు పోలీసులు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించారు. డీఎన్‌ఏ పరీక్షలను, రెండో అటాప్సీ పరీక్షలను నిర్వహించిన తర్వాత సుశీల్‌కుమార్‌ను దోషిగా నిర్ధారించారు.