క్రైమ్/లీగల్

సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 21: గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో 22 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ముంబయి సిబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సోహ్రాబుద్దీన్, భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసి ప్రజాపతి నకిలీ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు పోలీసులు అభియోగం మోపారు. ఈ కేసులోసోహ్రాబుద్దీన్, కౌసర్‌బీ , ప్రజాపతి మరణించారని కోర్టు న్యాయమూర్తి ఎస్‌జే శర్మ విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కోర్టు కేవలం సాక్ష్యాధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని సీబీఐ కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులందరూ విడుదలయ్యారు. వీరంతా గత కొద్ది కాలంగా బెయిల్‌పై ఉన్నారు. 13 ఏళ్ల ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. 92 మంది ప్రాసిక్యూషన్ సాక్షులు ఎదురుతిరిగారు. ఈ కేసులో 2010లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా అరెస్టయిన విషయం విదితమే. కాగా ఈ కేసులో అభియోగాల నుంచి 2014లో అమిత్‌షాకు విముక్తి లభించింది. ఈ కేసులో కుట్రకోణం దాగి ఉందని చెప్పేందుకు అవసరమైన సాక్ష్యాలను చూపించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ విఫలమైందన్నారు. ఈ కేసులో సోహ్రాబుద్దీన్‌తో పాటు ముగ్గురు మరణించారనే విషయం వాస్తవమని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ప్రస్తుతం నిందితులుగా ఉన్న వారు బాధ్యులని కోర్టు తీర్పులో పేర్కొనలేదు. ఈ ముగ్గురు బాధితులు హైదరాబాద్ నుంచి మహారాష్టల్రోని సాంగ్లీకి బస్సులో వస్తుండగా 2005 నవంబర్ 23,24 తేదీల్లో పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. సోహ్రాబుద్దీన్ దంపతులు ఒక వాహనంలో, ప్రజాపతిని మరోవాహనంలో పోలీసులు తీసుకెళారు. సోహ్రాబుద్దీన్‌ను నవంబర్ 26వ తేదీన గుజరాత్, రాజస్తాన్‌కు చెందిన పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపినట్లు అభియోగం. మూడు రోజుల అనంతరం కౌసర్‌బీని పోలీసులు, ఆ తర్వాత ప్రజాపతిని నకిలీ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చి చంపినట్లు పోలీసులు అభియోగం మోపారు. 22 మంది నిందితుల్లో 21 మంది జూనియర్ పోలీసు ఆఫీసుర్లు ఉన్నారు. మిగిలిన నిందితుల్లో వ్యవసాయ క్షేత్రం యజమాని ఉన్నారు. ఇక్కడ ఉన్న భవనంలో సోహ్రాబుద్దీన్ దంపతులను అక్రమంగా బంధించారు. ఆ తర్వాత వారిని తీసుకెళ్లి కాల్చి చంపినట్లు సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసులో కుట్ర దాగి ఉన్నట్లు డాక్యుమెంటరీ సాక్ష్యాలను చూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో కోర్టు కేవలం పరిస్థితులు, నిరాధారమైన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో సోహ్రాబుద్దీన్‌కు లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు నివేదించారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని హతమార్చేందుకు సోహ్రాబుద్దీన్ కుట్రపన్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐకు డాక్యుమెంటరీ సాక్ష్యాలు, సాక్ష్యం చెప్పేవారు లేకుండా పోయారు. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన ఇద్దరు సాక్షులు ఎదురుతిరిగారని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుతో అప్పటి గుజరాత్ హోంమత్రి అమిత్‌షా, రాజస్థాన్ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ వంజారా, పీసీ పాండే తదితరులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 210 మంది సాక్షులను విచారించింది. ఈ కేసును తొలుత గుజరాత్ సీఐడీ విచారించి సీబీఐకు బదిలీ చేశారు. అనంతరం 2013లో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను ముంబయి సీబీఐ కోర్టుకు విచారణ నిమిత్తం బదిలీ చేసింది.