క్రైమ్/లీగల్

నకిలీ కాల్‌సెంటర్‌పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నొయిడా, డిసెంబర్ 21: ఐటీ నగరం నొయిడాలో ఓ నకిలీ కాల్‌సెంట్‌ర్‌పై పోలీసులు దాడులు నిర్వహించి 126 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. కాల్‌సెంటర్ నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అనుమానం వచ్చి గురువారం రాత్రి దాడులు నిర్వహించినట్టు సీనియర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ వెల్లడించారు. బోగస్ అమెరికా పౌరసత్వం కలిగిఉన్నట్టు తెలిపారు. నొయిడాలోని సెక్టార్ 63లో ఈ కాల్‌సెంటర్ నడుస్తోంది. సెంటర్‌పై దాడి చేసి పలువురు టెలీఫోన్ ఆపరేటర్లను ప్రశ్నించారు. 126 మంది ఉద్యోగులను అరెస్టు చేసినట్టు శుక్రవారం పోలీసులు వెల్లడించారు.
గత కొద్ది నెలల్లో 12 నకిలీ కాల్‌సెంటర్లను కనుగొని ఆటకట్టించినట్టు ఎస్పీ తెలిపారు. అక్కడ కూడా నకిలీ విదేశీయులను అరెస్టు చేసినట్టు చెప్పారు. అమెరికా, కెనడా పౌరసత్వం ఉందని ఖాతాదారుల నుంచి డబ్బులు దండుకుంటున్నట్టు విచారణలో తేలిందని శర్మ పేర్కొన్నారు.