క్రైమ్/లీగల్

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రథయాత్రకు హైకోర్టు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కొతా, డిసెంబర్ 21: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ రథయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతిస్తూ సింగిల్ జడ్జి బెంచి ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. రథయాత్ర వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ ఇంటెలిజెన్స్ విభాగం సమర్పించిన 36 అంశాల నివేదికను పరిశీలించి కేసును తాజాగా విచారించాలని ధర్మాసనం సింగిల్ బెంచి కోర్టును ఆదేశించింది. ఈ కేసును వీలైనంత త్వరగా విచారించి తీర్పు ఇవ్వాలని సింగిల్ జడ్జి న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తిని ధర్మాసనం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా నిఘా విభాగం సేకరించిన సమాచారం వివరాలను ధర్మాసనానికి సమర్పించారు. తమ సమాచారాన్ని సింగిల్ బెంచి పరిగణనలోకి తీసుకోలేదని ఆయన నివేదించారు. సీల్డ్ కవర్‌లో వివరాలు ఇస్తే చూడకుండా తిరిగి ఇచ్చేశారన్నారు. 31 పోలీసు జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ సీల్డ్ కవర్‌లో పొందుపరిచామన్నారు. ఈ రథయాత్రను అనుమతిస్తే మతపరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఆందోలనను ఆయన కోర్టుకు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి బీజేపీ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కాని రాష్ట్రప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో బీజేపీ హైకోర్టులో సింగిల్ బెంచి కోర్టును ఆశ్రయించగా, కోర్టు రథయాత్రకు అనుమతించింది. బీజేపీ ఈ నెల 28 నుంచి 31వరకు రథయాత్రను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా సింగిల్ బెంచి ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం ధర్మాసనం వద్ద సవాలు చేసింది.