క్రైమ్/లీగల్

ప.గో.లో ఎసీబీకి చిక్కిన వీఆర్వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరపల్లి, డిసెంబర్ 21: పొలంలో వ్యవసాయ బోరు వేసుకోవడానికి అనుమతి మంజూరుకు రైతు నుండి రూ.13వేలు లంచం తీసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి ఇన్‌ఛార్జి వీఆర్వో కొండపల్లి వేణుగోపాల్ (గోపీ) శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికార్లకు దొరికిపోయారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ కథనం ప్రకారం దేవరపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ప్రగడ వెంకటేశ్వరరావు అనే రైతు తన పొలంలో వ్యవసాయ బోరు వేసుకోవడానికి అనుమతి కోసం ప్రయత్నించగా వీఆర్వో వేణుగోపాల్ కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు రూ.15వేలు లంచం ఇస్తేగానీ అనుమతి కోసం సంతకం పెట్టనని వీఆర్వో రైతు వెంకటేశ్వరరావుతో చెప్పాడు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని రైతు చెప్పడంతో రూ.13వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం వెంకటేశ్వరరావు ఏలూరు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణను ఆశ్రయించాడు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వెంకటేశ్వరరావు నుండి రూ.13 వేలు లంచం తీసుకున్న వీఆర్వో వేణుగోపాల్‌ను ఏసీబీ అధికార్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో నుండి లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో గోపాలకృష్ణను అరెస్టుచేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ గోపాలకృష్ణ విలేఖర్లకు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.