క్రైమ్/లీగల్

పల్నాడులో బాంబుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 21: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో లో శుక్రవారం ఒక్కసారిగా బాంబులు కలకలం రేపాయి. రెంటచింతల మండలం మంచికల్లు గురజాల ఎమ్యెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామం. శనివారం ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే స్థానిక వైకాపా నాయకుడు నరసింహారావు ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఇంటి బయట ఉన్న కారు కింది భాగంలో 15 నాటుబాంబులు కనిపించినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో నరసింహారావుపై అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి ధర్నా..
వైసీపీ నాయకుడు నరసింహారావును నాటుబాంబుల పేరుతో అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి గురజాల డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
మంచికల్లులో టీడీపీకి చెందిన వ్యక్తులే కారు కింద బాంబులు పెట్టి నరసింహారావును అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. వైసీపీ నాయకులపై కక్షసాధింపులో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, నరసింహారావును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే టీడీపీ నాయకులు మాత్రం ఎమ్మెల్యే యరపతినేని లక్ష్యంగా చేసుకొనే బాంబులు పెట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు మాత్రం విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని, అప్పటి వరకు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టిబందోబస్తు చర్యలు చేపట్టారు.