క్రైమ్/లీగల్

సింగరేణిలో అధికారికి గుండెపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, డిసెంబర్ 21: సింగరేణి ఎస్‌ఓటూ (ఫైనాన్స్) ప్రసాద రాజుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రామగుండం రీజియన్‌లోని 7 ఎల్‌ఈపీ బొగ్గు గనిలో సింగరేణి బొగ్గు పరిశ్రమ డైరెక్టర్ (ఫైనాన్స్) బలరాం పర్యటనలో ఘటన జరిగింది. బొగ్గు గనిలోకి దిగి అక్కడ సందర్శించిన సమయంలో ఎస్‌ఓటూ ఫైనాన్స్ అధికారి అస్వస్థతకు గురి కావడంతో అందరూ హడలిపోయారు. శుక్రవారం సాయంత్రం రామగుండం 7 ఎల్‌ఇపిలో డైరెక్టర్ (ఫైనాన్స్) బలరాంతోపాటు పలువురు సింగరేణి అధికారులంతా కూడా బొగ్గు గనిలోకి దిగి పని స్థలాలను పరిశీలించిన సందర్భంగా ఒక్కసారిగా ఎస్ ఓటూ(ఫైనాన్స్) ప్రసాద రాజుకు గుండె నొప్పి రావడంతో అధికారులు ఆయనను గోదావరిఖనిలోని సింగరేణి ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రసాద రాజుకు ఇంటెన్సివ్ కేర్‌లో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. సింగరేణి ఆసుపత్రికి సంబంధించిన వైద్యులతోపాటు గోదావరిఖనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులను సైతం పిలింపించి చికిత్స అందిస్తున్నారు. అధికారి ప్రసాద రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. డైరెక్టర్‌గా మొదటి సారిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రామగుండం పర్యటనకు వచ్చిన బలరాంతో హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చిన ప్రసాద రాజుకు గుండె పోటు రావండటంతో సింగరేణి ఉన్నతాధికారులకు దిక్కుతోచలేదు.