క్రైమ్/లీగల్

వంద కిలోల గంజాయ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, డిసెంబర్ 22: గత కొంత కాలంగా దివిసీమ మీదుగా సాగుతున్న అక్రమ గంజాయి తరలింపుకు అవనిగడ్డ పోలీసులు అడ్డుకట్ట చేశారు. ముందస్తు సమాచారం మేరకు అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు నేతృత్వంలో పులిగడ్డ చెక్ పోస్టు వద్ద శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.22లక్షలు విలువ చేసే 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇరువురు వ్యక్తులని అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన జింకల మద్దిలేటి, షేక్ మహబూబ్ వలిలు రిజిష్టర్ నెంబరు ప్లేటు లేని మహేంద్ర బోలెరో పిక్ ఆఫ్ ట్రక్‌లో రెండు కేజీలు చొప్పున నల్ల క్యారీ బ్యాగ్‌లో ప్యాక్ చేసిన 100 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. దీనిపై ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు అవనిగడ్డ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ నరసింహమూర్తి నేతృత్వంలో ఎస్‌ఐ సందీప్ పులిగడ్డ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ గంజాయిని పట్టుకున్నారు. వీరిని పోలీసులు విచారించగా ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో జింకల మద్దిలేటి గతంలో తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం పోలీసు స్టేషన్‌లో అక్రమ గంజాయి తరలింపుపై కేసు నమోదు అయ్యింది. కృష్ణాజిల్లా హనుమాన్ ఇంజన్ పోలీసు స్టేషన్‌లోనూ మద్దిలేటిపై కేసు నమోదు కాగా పరారీలో ఉన్నాడు. పెద్ద మొత్తంలో గంజాయిని దివిసీమలో పట్టుబడటం ఇదే ప్రథమం కావడం విశేషం. అయితే గత కొంత కాలంగా దివిసీమ మీదుగా గంజాయి అక్రమ రవాణా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.