క్రైమ్/లీగల్

మరో పరువు హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నారం: కన్న కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో తండ్రి, బంధువులు కలిసి అతి కిరాతంగా హతమార్చి అస్థికలను సైతం వాగులో కలిపేసిన సంఘటన ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో కలకలం సృష్టించింది. లక్సెటిపేట సీఐ శ్రీనివాస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన సింది అనురాధ (20) ఇదే గ్రామానికి చెందిన అయ్యూర్ లక్ష్మణ్ గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్నారు. లక్ష్మణ్ బీటెక్ చదువుతుండగా, అనురాధ డిగ్రీ చదువుతోంది. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరివీ బీసీ సామాజికవర్గంలో వేర్వేరు కులాలు కావడంతో అనురాధ తండ్రి సింది సత్తయ్య, సోదరుడు మహేష్ పెళ్ళికి అడ్డుచెప్పారు. అంతేగాక గత కొద్ది రోజులుగా అనురాధకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రేమికులిద్దరూ ఈనెల 3న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకొని శనివారం హైదరాబాద్ నుంచి జన్నారం వచ్చి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులతో ప్రాణభయం ఉందని ఎస్సై తహసినొద్దీన్‌కు వివరించగా పోలీసులు ఇరుకుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి లక్ష్మణ్ ఇంట్లో ఉన్న అనురాధను తండ్రి సత్తయ్య, అన్న మహేష్‌లు మరికొందరితో వచ్చి బలవంతంగా కొట్టుకుంటూ ఇంటికి తీసుకువెళ్ళారు. అదే రాత్రి ట్రాక్టర్‌లో కట్టెలు పోగుచేసి అనురాధను వెంట తీసుకువెళ్ళి నిర్మల్ జిల్లా కడెం మండలం దస్తురాబాద్ గ్రామ సమీపంలోగల పంట పొలంలో కర్రలతో చితకబాది కిరాతకంగా హతమార్చారు. అనంతరం అనూరాధ మృతదేహాన్ని అక్కడే తగలబెట్టి పథకం ప్రకారం ఆస్థికలను సమీపంలోని వాగు నీటిలో కలిపేశారు. సోమవారం సమాచారం తెలుసుకున్న పోలీసులు కలమడుగు గ్రామానికి వెళ్ళి విచారించి మృతురాలి తండ్రి సత్తయ్య, అన్నయ్య మహేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్ రావు, ఏసీపీ గౌస్‌బాబాలు సందర్శించారు.