క్రైమ్/లీగల్

గల్ఫ్ ఏజెంట్ల ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 23: ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోయిన పలు గల్ఫ్ బాధిత కుటుంబాలు ఆదివారం జిల్లా కేంద్రానికి తరలివచ్చి ఇన్‌చార్జి సీ.పీ శ్రీ్ధర్‌రెడ్డిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాయి. గల్ఫ్‌లో ప్రముఖ కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తామని నమ్మబలికిన ఏజెంట్ల మోసానికి గురై తమ ఆప్తులు ఎడారి దేశాల్లో పడరాని పాట్లు పడుతున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. మోసానికి పాల్పడ్డ గల్ఫ్ ఏజెంట్లపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని వారు ఇన్‌చార్జి సీ.పీని వేడుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, బాన్సువాడ, నిర్మల్ జిల్లా వారు కుటుంబాల పోషణ కోసం గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకోగా, వారిని గల్ఫ్ ఏజెంట్లుగా చెలామణి అవుతున్న దండు నారాయణ, మహ్మద్ అన్వర్‌లు సంప్రదించారు. గల్ఫ్ దేశాల్లో పేరెన్నికగన్న కంపెనీల్లో ఆకర్షణీయ వేతనంపై పంపిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుండి లక్ష రూపాయల పైచిలుకు నగదును వీసాల పేరుతో వసూలు చేశారు. ఏజెంట్ల మాటలను నమ్మిపై వ్యక్తులంతా గల్ఫ్ దేశాలకు వెళ్లగా, అక్కడ ఏజెంట్లు చెప్పిన కంపెనీల్లో పని లభించక, వర్క్ పర్మిట్లు లేకపోవడంతో బాధితులంతా గడిచిన ఆరు మాసాల నుండి గల్ఫ్‌లోనే చిక్కుబడిపోయి దుర్భర స్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవనాలు వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబీకులు గల్ఫ్ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బసంత్‌రెడ్డిని ఆశ్రయించగా, ఆయన పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి తరలివెళ్లి ఇన్‌చార్జి సీ.పీ శ్రీ్ధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మోసానికి పాల్పడ్డ ఏజెంట్లను నిలదీస్తే, తమకేమీ తెలియదంటూ వాపోయారు. తమ కుటుంబీకులు పరాయి దేశంలో దుర్భర స్థితిలో జీవనం వెళ్లదీస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గల్ఫ్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.