క్రైమ్/లీగల్

బరితెగించిన ఎర్రచందనం స్మగ్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నగొట్టిగల్లు, డిసెంబర్ 23: ఎర్రచందనం స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. చిత్తూరు జిల్లాలోని భాకరాపేట సమీపంలో శనివారం అర్ధరాత్రి ఏడుగురు టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా 80 మంది స్మగ్లర్లు చుట్టుముట్టి కత్తులు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో తమను తాము కాపాడుకునేందుకు టాస్క్ఫోర్స్ సిబ్బంది ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు.
దీంతో స్మగ్లర్లు పారిపోగా సంఘటనా స్థలం నుంచి దాదాపు 58 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా స్మగ్లర్ల వద్ద లభించిన బ్యాగులో శేషాచల అడవుల్లోని కొన్ని చిన్న జంతువుల శరీర అవయవాలు ఉండటం చూసి టాస్క్ఫోర్స్ సిబ్బంది అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజువారీ తనిఖీల్లో భాగంగా భాకరాపేట అటవీ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఐ వాసు బృందం దాదాపు 20 నుంచి 30 మంది స్మగ్లర్లను గుర్తించి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్మగ్లర్లు తమ వద్ద ఉన్న దుంగలను అక్కడే పడేసి పారిపోగా ఆర్‌ఎస్‌ఐ వాసు బృందంలోని ముగ్గురిని అక్కడే కాపలా ఉంచి మిగిలిన ఏడుగురు సిబ్బంది స్మగ్లర్లను వెంబడించారు.
వీరిని గుర్తించిన దాదాపు 50 మంది స్మగ్లర్లు ఒక్కసారిగా రాళ్లు, కత్తులను వారిపైకి విసురుతూ ముందుకు రావడం గమనించారు. దీంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడ నుంచి పారిపోయారు. సంఘటనా స్థలంలో 55 ఎర్రచందనం దుంగలను గుర్తించగా, అక్కడకు చేరుకున్న డాగ్ స్క్వాడ్ మరో మూడు దుంగలను గుర్తించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐజీ కాంతారావు ఆర్‌ఎస్‌ఐ వాసు, డిఆర్వో పీవీఎన్ రావు బృందాన్ని అభినందించారు. ఈసందర్భంగా ఐజీ కాంతారావు మాట్లాడుతూ స్మగ్లర్ల వద్ద లభించిన ఎర్రచందనం దుంగలు ఏ గ్రేడ్, సూపర్ ఏ గ్రేడ్‌వన్నారు. అలాగే వారి వద్ద లభించిన కాగితాల ఆధారంగా తప్పించుకుని పారిపోయిన స్మగ్లర్లు జవ్వాదిమలైకి చెందినవారనే స్పష్టం అవుతోందన్నారు. వీరు అడవుల్లోని జంతువులను చంపి వాటిని తింటారని, అలాగే వాటి అవయవాలను ఇంటి వద్ద పెట్టుకుంటే దుష్టశక్తులు రాకుండా ఉంటాయని నమ్ముతారన్నారు. అందులో భాగంగానే సంఘటనా స్థలంలో లభించిన కొండముచ్చు కాళ్లు, చిన్న కోతి చర్మం, బిట్టర ఉడత తోక ఉందన్నారు. వీటితోపాటుగా సీసం గుర్తించామని, నాటు తుపాకీకి ఉపయోగించే గుండ్ల తయారీకి ఈ సీసంను వినియోగిస్తారన్నారు. గతంలో శేషాచలం అడవుల్లో జంతువులను వేటాడుతన్న స్మగ్లర్లతోపాటు నాటు తుపాకులను పట్టుకున్నామని ఐజీ కాంతారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ డిఎస్పీ వెంకటరమణ, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్‌ఆర్వో లక్ష్మీపతి, ప్రసాద్, సీఐ కొండయ్య, ఆర్‌ఐ భాస్కర్, ఎస్‌ఐ సోమశేఖర్, డాగ్ స్క్వాడ్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
చిత్రం..టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడిలో పట్టుబడ్డ
జంతువుల అవయవాలు, ఎర్రచందనం దుంగలు