క్రైమ్/లీగల్

విద్యుద్ఘాతానికి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట , డిసెంబర్ 24: వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు నీటి బోరును మరమ్మతు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటుషాక్ తగిలి నెలవల బాలసుబ్రమణ్యం (37) అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని తిమ్మాజీ కండ్రిగ గ్రామంలో చోటు చేసుకుంది. అదే సమయానికి గొర్రెల కాపరిగా ఉన్న సంక్రాంతి సుప్రియ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఘటనా స్థలంలోని నెలవెల రమేష్, కల్లూరు మణెయ్య అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే తిమ్మాజీ కండ్రిగకు చెందిన రమేష్, మణెయ్యలకు స్వర్ణముఖి నదిలో వ్యవసాయ బోరు ఉంది. ప్రస్తుతం బోరు మరమతులకు గురైంది. ఇదే గ్రామానికి చెందిన మృతుడు బాలసుబ్రమణ్యంకు ఉన్న 20 సెంట్ల భూమికి సాగునీరు అవసరం కావడంతో బోరును రిపేరు చేయడానికి ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో బాలసుబ్రమణ్యం పైపులైన్ లీక్‌అవుతున్న చోట గుంట తవ్వి మరమతులు చేస్తున్న సమయంలో హటాత్తుగా కరెంటు రావడంతో వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఘటన స్థలంలోని కొంత దూరంలో గొర్రెలు మేపుకుంటున్న సంక్రాంతి సుప్రియ అనే మహిళ ప్రమాదాన్ని గమనించి సమయస్ఫూర్తితో వ్యవహరించింది. తన చేతిలో ఉన్న కర్రతో కరెంటు స్థంభం వద్ద తగిలించిన కరెంటు తీగలను కొట్టడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఘటనాస్థలంలో సహాయకులుగా ఉన్న మణెయ్య ప్రాణాపాయం నుంచి బయటపడగా రమేష్ అనే వ్యక్తి గాయాలతో తప్పించుకున్నారు. సుప్రియను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తి 108 ద్వారా గాయపడ్డ రమేష్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు బాలసుబ్రమణ్యం మృతదేహాన్ని పంచనామా అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు టీడీపీకి చెందినవాడు కావడంతో నియోజకవర్గ ఇన్‌చార్జి పరసా వెంకటరత్నం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రన్న బీమా పథకం నిధులతోపాటు పార్టీపరంగా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.