క్రైమ్/లీగల్

కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మార్చి 11: అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. సంఘటనతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఓ చిన్నారితోపాటు ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. తిరుమలగిరి నుంచి కార్కానా వైపు వేగంగా వస్తున్న ఇన్నోవా కారు చౌరస్తాలో వేగంగా మలుపు తీసుకుంటూ అదుపు తప్పింది. ఎదురుగా వెళ్తున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. కారు వెనుకభాగం ధ్వంసమైంది. మరో కారును ఢీకొట్టి ప్రక్కనే ఉన్న పుట్‌పాత్ మీదకు ఎక్కింది. అక్కడ రెయిలింగ్‌ను తాకుతూ వేగంగా ప్రయాణిస్తూ పార్కింగ్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలపై నుంచి వెళ్లింది. రెండు వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. కారు వేగం తగ్గలేదు. కొద్ది దూరం అలాగే ప్రయాణించి మెయిన్ రోడ్డుకు చేరుకుంది. ఇంతలో తిరుమలగిరి నుంచి సికిందరాబాద్ వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను వెనుక నుంచి ఢీకొట్టి ఆగిపోయింది. ఆటోను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ఆటోలోని నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆటో డ్రైవర్‌తోపాటు పదకొండు సంవత్సరాల బాలుడు గాయపడ్డాడు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న తిరుమలగిరి పోలీసులు రంగంలోకి దిగి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షణాల్లో జరిగిన సంఘటనతో భీతిల్లిన వాహనదారులు తమ వాహనాలను వదిలి పరుగులు తీశారు. ఈ ఘటనతో తిరుమలగిరి నుంచి సికిందరాబాద్ వరకు ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దెబ్బతిన్న వాహనాలను క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకుని, ఇన్నోవా కారు యజమాని నిఖిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.