క్రైమ్/లీగల్

అనర్హులుగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: నలుగురు మంత్రులతో సహా 22 మంది వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించినందున వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ఎ వెంకటరాంబాబు అనే మాజీ ఎమ్మెల్యే పిల్ దాఖలు చేశారు. మంత్రులు సి ఆదినారాయణ రెడ్డి, ఎస్ కృష్ణ రంగారావు, ఎన్ అమర్‌నాధ్‌రెడ్డి, భూమా అఖిలప్రియలను మరో 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పిల్‌లో కోరారు. ప్రతి రోజు వారు ఆ పార్టీలోనూ, పదవుల్లోనూ కొనసాగుతున్నందుకు రోజుకు రూ.500 జరిమానా విధించాలని కూడా పిటీషనర్ కోరారు. 10వ షెడ్యూలు పేరా 2 ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారు తమ సభ్యత్వం కోల్పోతారని స్పష్టంగా ఉందని గుర్తుచేశారు.