క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 28: ఒంగోలు నగరానికి సమీపంలోని పేర్నమిట్ట వద్దగల శ్రీ ప్రతిభ కాలేజి వద్ద ఆ కాలేజి లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న కనుమర్ల రాజారెడ్డి (16) అనే విద్యార్ధి గురువారం అర్ధరాత్రి తరువాత పెట్రోల్ మంటలతో కాలిపోయి అనుమాన స్పద స్థితిలో మృతి చెందారు. తొలుత మృతి చెందిన విద్యార్ధి ఎవరనే విషయాన్ని అటు కాలేజి యాజమాన్యం గాని, ఇటు విద్యార్థులు గాని గుర్తించలేదు, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చివరకు మృతి చెందిన విద్యార్థి ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలం, నాగాలవరం గ్రామానికి చెందిన కనుమర్ల రాజారెడ్డిగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ సిఐ గంగా వెంకటేశ్వర్లు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి తరువాత శ్రీప్రతిభ జూనియర్ కాలేజి వద్దగల గేటు వద్ద ఒక విద్యార్ధి పెట్రోల్ మంటలలో కాలిపోవడాన్ని అక్కడ నైట్ డ్యూటీ చేసే కాలేజి కి చెందిన వ్యక్తి గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని అక్కడ ఉన్న కాలేజి కి చెందిన కొంతమంది సిబ్బంది తోపాటు, విద్యార్థులకు కూడా పెద్దగా అరుస్తూ సమాచారాన్ని అందించినట్లు సి ఐ తెలిపారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తోపాటు, విద్యార్థులు కూడా పరుగులు తీస్తూ వచ్చి వెంటనే ఆ విద్యార్థిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కాలేజిలో నైట్ కాపలా ఉన్న సిబ్బంది అయిన సుబ్బారెడ్డి వెంటనే శ్రీ ప్రతిభా కాలేజి యాజమాన్యానికి సమాచారం అందించడం తోపాటు తమ పోలీసు స్టేషన్‌కి కూడా సమాచారం ఇవ్వడంతో తన తోపాటు తమ పోలీసు స్టేషన్‌కి చెందిన ఎస్ రాజారావు కలసి సంఘటనా స్థలాన్ని సందర్శించామని సిఐ తెలిపారు. అయితే తమకి రాత్రి రెండున్నర గంటలకు సమాచారం అందిందని, వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలో పడివున్న మృత దేహాన్ని పరిశీలించగా అప్పటికే విద్యార్ధి మృతి చెంది ఉన్నట్లు సి ఐ తెలిపారు. మృతి చెందిన విద్యార్ధి రాజారెడ్డిగా గుర్తించామన్నారు. కాలేజికి చెందిన నైట్ డ్యూటీ చేసే సిబ్బంది అయిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆత్యహత్య లేక హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సిఐ తెలిపారు.