క్రైమ్/లీగల్

వెంటాడి..వేటాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, మార్చి 12: పట్టపగలు రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థిపై వేటకొడవళ్లతో వెంటాడి దారుణంగా హతమార్చారు. ఈ హత్య నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. ప్రశాంతంగా ఉండే కూకట్‌పల్లి ప్రాంతంలో ఈ తరహా హత్య స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య చేసిందే హతుడి స్నేహితులే కావడం విశేషం. బస్తీలో ఉన్న స్నేహితుల మధ్య తలెత్తిన గొడవల్లో భాగంగా యువకుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణే ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట జనతానగర్‌లో నివాసం ఉండే రాజు పాలవ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనకు నలుగురు సంతానం. నలుగురిలో చిన్న కుమారుడు సుధీర్ కూకట్‌పల్లిలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం పరీక్ష రాసేందుకు సహ విద్యార్థులు మేఘనాథ్, సాయిలతో కలిసి సుధీర్ బైక్‌పై బయలుదేరాడు. వారు కూకట్‌పల్లి జే ఎస్‌పీ హోండా షోరూం వద్దకు చేరుకోగానే అప్పటికే కాపు కాసిన నలుగురు దుండగులు సుధీర్‌ను అడ్డగించి వేట కొడవళ్లతో వెంటాడి దాడి చేశారు. అయితే వారిని అడ్డగించేందుకు ప్రయత్నించిన సాయి, మేఘనాథ్‌పై కూడా నిందితులు దాడికి యత్నించడంతో వారు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. హత్య చేసి పరారవుతున్న నలుగురిని అక్కడే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు ప్రభాకర్ గమనించి వెంటపడి దుండగుల్లో ఒకరిని పట్టుకున్నాడు. అప్పటికే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. అయితే మూసాపేటలో నివాసం ఉంటున్న కృష్ణ, మహేష్, నవీన్, తేజ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరిలో నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటనకు సంబంధించిన వివరాలను రాబడుతున్నారు. ఎసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఈ ఘటన జరగడం సంచలనం కలిగించింది.