క్రైమ్/లీగల్

వెంటనే వెళ్లలేం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనలో భాగంగా ఏపీలో హైకోర్టుకు సంబంధించిన కనీస వసతులు చేపట్టకుండా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు తప్పుపట్టారు. దీనిని ఏకపక్ష నిర్ణయంగా అభివర్ణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 26న రాష్టప్రతి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు 31వ తేదీని గడువుగా ప్రకటించడం పట్ల న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఐదు రోజులు గడువు ఇచ్చి అమరావతికి పోమ్మంటే ఎలా పోతామని కేంద్రాన్ని నిలదీశారు. కనీసం మూడు నెలలు గడువు ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టులో వౌలిక వసతులు కల్పించినప్పుడే బదిలీ కార్యక్రమాలు చేపట్టాలని, అప్పటి వరకు తాత్కాలింగా కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ బార్ కౌన్సిల్ కోరింది. కాగా, కేంద్ర జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ శనివారం సుప్రీం కోర్టులో ఏపీ న్యాయవాదులు అత్యవసర పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఏపీ న్యాయవాదుల పక్షాన పోరాడానికి బార్‌కౌన్సిల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ రామన్నదొర, సీతారాం శనివారం ఢిల్లీ వెళుతున్నారు. ఈమేరకు హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టులో ఏపీ న్యాయవాదులు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో భవిషత్తులో చేపట్టబోయే నిర్ణయాలపై చర్చించారు. అమరావతిలోని ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ఎలాంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా జనవరి 1వ తేదీ నుంచి అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వ్యతిరేకించింది. ఎలాంటి గడువు లేకుండా కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం ఏమిటని ఆంధ్రా న్యాయవాదుల ప్రెసిడెంట్ రామన్నదొర ప్రశ్నించారు. ఈనెల 15 నాటికి హైకోర్టుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని న్యాయవాదులు ప్రస్తావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయటంతో కేంద్ర ఉన్నపళంగా ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయవాదులు వాపోయారు. ప్రపంచంలోనే అత్యంత సుందీకరణ పద్ధతిలో ఏపీ హైకోర్టును తీర్చిదిద్దుతున్నామని పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. ఏపీ హైకోర్టులో వందలాది మంది ఉద్యోగులు, న్యాయవాదులు తమ కార్యకలాపాలు చేసుకోవడానికి ప్రస్తుతం అక్కడ వసతులు లేవన్నారు. జనవరి 1వ తేదీ నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం సూచించడం జరిగిందని వారు నిలదీస్తున్నారు. హైకోర్టు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో అబద్దాలు గుర్తు చేస్తున్నాయని సీనయర్ న్యాయవాదులు మనోహరరెడ్డి, నాగిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆలా ఉండగా తెలంగాణ హైకోర్టును ప్రస్తుతం ఉన్న హైకోర్టులోనే కార్యకలాపాలు చేసుకోవచ్చ అన్న కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ న్యాయవాదులు స్వాగతించారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ బార్ కౌన్సిల్‌కు చెందిన న్యాయవాదులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. హైకోర్టులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు. భవివిషత్ చేపట్టాల్సి అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.