క్రైమ్/లీగల్

ఆర్థిక మోసాలకు పాల్పడే సంస్థలను నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 28: రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థిక మోసాలపై రిజర్వు బ్యాంక్, బ్యాంక్‌ల ఉన్నతాధికారులు, సీఐడీ, హోం శాఖ అధికారులతో శుక్రవారం పునేఠా సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్ ఫండ్ కంపెనీలు, సహకార సంస్థల ముసుగులో ఆర్థిక మోసాలకు పాల్పడుతూ నిధులను షెల్ కంపెనీల్లోకి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరహా మోసాలను అడ్డుకట్టవేసేందుకు అన్ని వ్యవస్థలు సమర్ధవంతంగా పని చేయాలన్నారు. ఇందుకు అవసరమైన చట్టాలను తెచ్చేందుకు వీలుగా కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నారు.రాష్ట్రంలో5 వేల జనాభా దాటిన ప్రతి గ్రామంలో బ్యాంక్ శాఖ నెలకొల్పుతున్నట్లు సీఎస్‌కు ఆర్‌బీఐ అధికారులు వివరించారు. 5 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకింగ్ కరెస్పాండెట్ల ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి హాయ్‌ల్యాండ్ బిడ్డింగ్ ఫిబ్రవరి 8న జరుగనుందని సీఐడీ ఐజి అమిత్ గార్గ్ తెలిపారు. షెల్ కంపెనీల కార్యకలాపాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 48 సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు సీఎస్‌కు అధికారులు తెలిపారు.