క్రైమ్/లీగల్

భైరాన్ చెరువు వద్ద అడవిలో శవం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, మార్చి 13: మండల పరిధిలోని చెరువువాండ్లపల్లికి దగ్గరలో వున్న భైరాన్ చెరువు వద్దనున్న అడవిలో ఓ వ్యక్తి శవం లభ్యమైనట్లు స్థానిక ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కాగా మృతి చెందిన వ్యక్తి బుక్కపట్నం వాసి విష్ణువర్ధన్ (35)గా గుర్తించారు. చెరువువాండ్లపల్లికి చెందిన గొర్రెల కాపరులు తమ పశువులను మేతకు తోలుకుని అడవికి పోగా అక్కడ వచ్చిన దుర్వాసన కారణంగా విష్ణువర్ధన్ శవం వున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో శవాన్ని అక్కడి నుంచి తొలగించి ఎవరిదని విచారణ చేబట్టగా బుక్కపట్నం వాసిగా గుర్తించారు. మృతుడు మతిస్థిమితం లేని వాడని గతంలో కూడా బుక్కపట్నం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసును మృతుడి బంధువులు పెట్టినట్లు తెలిసింది. గత నాలుగు రోజుల క్రితం భైరాన్ చెరువు వద్ద విష్ణువర్ధన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. శవాన్ని పోస్టుమార్టం అనంతరం మృతుడి భార్య, తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రమాదవశాత్తు కారు దగ్ధం
* తృటిలో తప్పిన ప్రమాదం
వజ్రకరూరు, మార్చి 13 : ఉరవకొండ నుంచి గుంతకల్లుకు వెళ్తున్న ఇండికా కారు మంగళవారం గూళపాల్యం వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్ అయి దగ్ధమైంది. అయితే ప్రయాణిస్తున్న నలుగురు తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. గుంతకల్లుకు చెందిన జహంగీర్‌బాషాతోపాటు మరో ముగ్గురు ఉరవకొండ వెళ్లి తిరిగి వస్తుండగా గూళపాల్యం వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు పక్కనే తోటలో ఉన్న ట్యాంకర్‌తో నీటిని చల్లడంతోపాటు మట్టిని చల్లినా ఫలితం లేకుండా పోయింది. ఘటన స్థలానికి ఎస్సై ఇబ్రహీం చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విచారణకు హాజరైనఎమ్మెల్యే బాలయ్య వ్యక్తిగత కార్యదర్శి
హిందూపురం టౌన్, మార్చి 13 : స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య మంగళవారం తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య ప్రభుత్వ ఉద్యోగిగా అంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్థానిక న్యాయవాది ఇందాద్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టు కేసు కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి నివేదిక అందచేయాలని ఉప ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యశర్మను విచారణాధికారిగా నియమించింది. గత గురువారం ఫిర్యాదుదారుడు ఇందాద్ విచారణకు హాజరై వీరయ్య పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటాన్ని, ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించడం తదితర ఆధారాలను అందజేశారు. అప్పట్లోనే వీరయ్య కూడా విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు విచారణాధికారికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణకు హాజరైన తన వాదనను వినిపించారు. దాదాపు నాలుగు పేజీల వివరణను తనకు అందచేసినట్లు విచారణాధికారి సుబ్రమణ్యశర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు.