క్రైమ్/లీగల్

శ్రీ చైతన్య విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 3: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు శ్రీ చైతన్య కళాశాలలో మెడికల్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న అనంతపురం విద్యార్థిని చంద్రికా నాగమణి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తరగతి గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సంఘటనపై ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి వై.రాము నాయకత్వంలో విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తక్షణం స్పందించి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. జెసీ విజయ్‌కృష్ణన్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో లభ్యమైన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్రం..ఆత్మహత్యకు పాల్పడిన చంద్రికా నాగమణి