క్రైమ్/లీగల్

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ/వనపర్తి, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ అపశ్రుతులు దొర్లక తప్పలేదు. కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు.
బాధిత కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చిన ఘటనలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వేడుకలు ముగిసిన అనంతరం తమ ఇళ్లకు చేరుకునే క్రమంలో రోడ్డు ప్రమాదం బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20), దిగంబర్ (18) అనే యువకులు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం తన స్నేహితుల వద్దకు బైక్‌పై వెళ్లారు. అర్ధరాత్రి దాటిన అనంతరం వేడుకలు ముగించుకుని వారు కోనాపూర్‌కు తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు జారిపోయింది. దీంతో శ్రీకాంత్, దిగంబర్‌లు కిందపడిపోయి వారి తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలవడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో వీరితో పాటు బైక్‌పై ఉన్న మరో యువకుడికి కూడా తీవ్ర గాయాలు కాగా, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు బాన్సువాడ సీఐ మహేష్‌గౌడ్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున యువకుల మద్య ఘర్షణ జరిగి ఒకరు మృతిచెందారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన పుష్ఫేందర్ (27) అతని మిత్రుల వద్దకు సంతబజార్‌కు చెరుకున్నారు. సంబరాలు జరుపుకున్న అనంతరం సుమారు మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే సందర్బంలో మిత్రుల మద్య ఘర్షణ జరిగింది. దాంతో యువకులు పుష్పేందర్‌పై దాడి చేయడంతో కింద పడి తలకు గాయమై తీవ్ర రక్త స్రావం జరిగింది. దాంతో ఆ యువకులు అక్కడి నుండి పరారు కాగా పోలీసులు పెట్రోల్ వాహనంలో అక్కడికి చెరుకొని విషయాన్ని గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడు.
చిత్రం..వనపర్తిలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన పుష్పేందర్