క్రైమ్/లీగల్

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), జనవరి 2: పార్వతీపురం డివిజన్ సీతానగరం మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన నీరస సింహాచలం (54) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్న సింహాచలం ఈ మద్య కుమార్తె వివాహం చేసాడు. వివాహం వలన కొద్దిగా అప్పులు ఉండటం వలన మనస్తాపం చెంది సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే కటుంబ సభ్యులు గమనించి పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు, అక్కడ వైద్యం జరుగుతుండగా ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో మృతిచెందాడని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. సీతానగరం ఎస్సై డి.సాయికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న ఖైనీచ గుట్కాలు స్వాధీనం
పార్వతీపురం (రూరల్), జనవరి 2: ఒడిశా రాష్ట్ర సరిహద్దు గ్రామమైన నారాయణపట్నం నుండి వీరఘట్టాం గ్రామానికి ప్రభుత్వ నిషేధిత ఖైనీ, గుట్కాలను తరలిస్తున్న చిన్నారి వెంకటరమణ అనే వ్యక్తిని పార్వతీపురం రూరల్ ఎస్. ఐ వి. లోవరాజు వెంకంపేట జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. అతని వద్ద నుండి రూ 10, 500 విలువైన అక్రమ ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.కేసు నమోదు చేసామన్నారు.