క్రైమ్/లీగల్

ఆటో బోల్తా ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, జనవరి 2: పరిమితులకు మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటోబోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. లువ్వాశింగి పంచాయతీ సంగులోయ గ్రామం నుంచి ఆటోలో జి.మాడుగుల కు రావడానికి 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని వస్తు వరదమామిడి గ్రామం సమీపంలో ఘటీ ఎక్కే సమయంలో బోల్తా పడింది. ఈ ఘటన లో సంగులోయ గ్రామానికి చెందిన ఇంచెంగి చంద్రయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. అదిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యేక సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడగా వారిని 108 ద్వార స్థానిక ఆసుపత్రి లో చేర్చి ప్రధమ చికిత్స అందించారు.