క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాంతకం, జనవరి 2: కర్నూలు- గుంటూరు జాతీయ రహదారిలో మండలంలోని కేసినేనిపల్లి స్టేజీ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం తెల్లవారుఝామున జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేసినేనిపల్లి గ్రామ స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని నరసరావుపేట నుంచి మార్కాపురం వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మార్కాపురానికి చెందిన గ్రంధిశిల సుబ్బారావు (40), తిరుమల్ల శివశంకర్ (60) అక్కడికక్కడే మృతి చెందగా గ్రంధిశిల లక్ష్మీగీతకు తీవ్రగాయాలయ్యాయి. ఈమెను వైద్యచికిత్సల నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. గ్రంధిశిల సుబ్బారావు, లక్ష్మీగీతలు నరసరావుపేటలో వైద్యం చేయించుకునేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బంధువులైన శివకుమార్‌తో కలిసి కారులో మార్కాపురం వస్తున్నారు. ఈ తరుణంలో రోడ్డుప్రమాదం జరగడంతో డ్రైవింగ్ చేస్తున్న శివశంకర్, సుబ్బారావులు మృతి చెందారు. ఎస్సై కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.