క్రైమ్/లీగల్

ముఠా కార్మికుని మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మార్చి 13: సామాన్య ముఠా కార్మికుడు పలువురు వ్యాపారులు, సహచర ముఠా కార్మికులకు రూ. 1.50 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. ఈ సంఘటన పాతబస్తీలో వెలుగుచూసింది. అందిన సమాచారం ప్రకారం.. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుండి విజయవాడ నగరానికి వలస వచ్చిన ఓ వ్యక్తి ఊర్మిళానగర్‌లో నివాసముంటున్నాడు. ముఠామేస్ర్తీగా వందలాది మంది వ్యాపారులు, ముఠా కార్మికులకు సుపరిచితుడైన ఈ వ్యక్తి కుమారుడు కూడా ముఠా పనిలో అందరితో కలివిడిగా తిరుగుతూ తండ్రి కంటే ఎక్కువ పరిచయాలు పెంచుకున్నాడు. ఆరు నెలల క్రితం ఇంటిని నిర్మించుకుంటున్నానని సహచర కార్మికులకు మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పులు చేశాడు. చాలామందికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చాడు. కార్మికులనే కాకుండా పలువురు వ్యాపారుల వద్ద కూడా లక్షలాది రూపాయలు అప్పుగా దండుకున్నాడు. చివరకు 14 మంది బాధితులకు ఐపీ నోటీసులు కోర్టు ద్వారా పంపడంతో అతని రంగు బయటపడింది. బాధితులంతా నారాయణా.. ఇదేం మోసం అంటూ లబోదిబోమంటున్నారు. 14 మంది బాధితుల్లో కొందరు రెండు, మూడు, ఐదు, ఎనిమిది, పది లక్షల చొప్పున ఆ మోసగాని చేతలో పెట్టి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాతబస్తీలో వ్యాపించి మంగళవారం కలకలం రేపింది. దాంతో ఇప్పటివరకు రూ. 72లక్షల మేరకు ఐపీ నోటీసులు అందుకున్న బాధితులు గుండెలు బాదుకుంటుండగా, మరో 12మంది ముఠా కార్మికులు తమ వద్ద వున్న ప్రాంసరీ నోట్లు పట్టుకుని తాము రూ. 40 లక్షలకు మోసపోయామని వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించడానికి సమాయత్తమయ్యారు. ఇంకా బాధితులు పెరుగుతారని, మొత్తం రూ. 1.50 కోట్ల మేరకు నిందితుడు మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. కాగా తండ్రి ముఠా మేస్ర్తిగా పనిచేసిన పరిచయాలతో అతని తనయుడు పథకం ప్రకారమే ఇంత నగదు దండుకున్నాడని బాధితులు చెబుతున్నారు. నిందితుడు తన పేరున ఎలాంటి స్థిరాస్తులు లేకుండా జాగ్రత్తపడి తన తండ్రి పేరిట నగరంలో, ఊర్మిళానగర్‌లో నాలుగు బిల్డింగ్‌లు కొనేశాడని అంటున్నారు. ఇప్పుడు కొందరికి ఐపీ నోటీసులు పంపడంతో అందరూ అవాక్కయ్యారు. బాధితులందరి వివరాలు సమీకరించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని పలువురు బాధితులు తెలిపారు.