క్రైమ్/లీగల్

బాలికను వేధిస్తున్న యువకునికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, మార్చి 13: ఇంటర్మీడియేట్ చదువుతున్న మైనర్ బాలికను గత కొంత కాలంగా వెంబడిస్తూ ప్రేమించమని వేధిస్తూ భయాందోళనకు గురి చేస్తున్న నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ అవనిగడ్డ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ దాడి చంద్రశేఖర్ తెలిపారు. ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం స్థానిక పెదకళ్లేపల్లి రోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువుతున్న మైనర్ బాలికను మోపిదేవి మండలం బోడగుంట గ్రామానికి చెందిన తేళ్ల రాము గత కొంతకాలంగా వెంబడిస్తూ ప్రేమించమని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన బాలిక నిందితుడైన రాము వికృతి శ్రేష్టలను తల్లిదండ్రులకు తెలుపగా వారు స్థానిక పెద్ద మనుషుల సహకారంతో పలుమార్లు నిందితునికి చెప్పిచూశారు. అయినప్పటికీ నిందితుని ప్రవర్తనలో మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. సోమవారం పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసి తండ్రితో కలిసి వస్తున్న మైనర్ బాలికను అడ్డగించి ప్రేమించకపోతే యాసిడ్‌తో దాడి చేస్తానని హెచ్చరిస్తూ బాలిక తండ్రితో గొడవ పడ్డాడు. స్థానికుల సూచనల మేరకు పోలీసులను ఆశ్రయించిన బాలిక ఈ మేరకు ఫిర్యాదు చేయటంతో పోక్టా యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ చంద్రశేఖర్ నిందితుడిని అరెస్టుచేసి మంగళవారం అవనిగడ్డ కోర్టుకు హాజరుపర్చారు. బాలికలు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆకతాయిలపై కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.