క్రైమ్/లీగల్

హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, మార్చి 13: గుడుపల్లె మండలం తంజమ్మ కొటాలు గ్రామం వద్ద జరిగిన మురుగేష్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వలయాధికారి రాఘవన్ వెల్లడించారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తంజమ్మ కొటాలు గ్రామంలో నివాసం ఉంటున్న హనుమంతు, అతని బావమరిది మురుగేష్ కుటుంబాల మధ్య 30 ఏళ్లుగా ఆస్థి గొడవలు జరుగుతున్నాయి. కుప్పం, గుడుపల్లి మండలాల పోలీస్ స్టేషన్‌లలో కేసులు కూడా నమోదయ్యాయి. రెండు నెలలుగా కుప్పం-పలమనేరు జాతీయ రహదారి పక్కన తంజమ్మ కొటాలు గ్రామం వద్ద గల 36 సెంట్ల భూమి తమదంటే తమది అంటూ రెండు కుటుంబాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. పలువురు గ్రామ పెద్దలు సైతం పలుమార్లు వీరి కుటుంబాల మధ్య రాజీ ప్రయత్నాలు చేశారు. చివరకు తమకు అడ్డుగా ఉన్న మురుగేష్‌ను చంపాలని హనుమంతు కుట్రపన్నారు. హనుమంతు కుటుంబ సభ్యులు ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 9వ తేదీన మురుగేష్ కొత్తగా నిర్మిస్తున్న అంగడి రూము వద్ద మట్టిపని చేసుకుంటూ ఉండగా, హనుమంతు కుమారులు కమలేష్ (30), కుమరేష్ (28)తో పాటు వారి స్నేహితుడు మురుగేష్‌లు ద్విచక్రవాహనంపై వచ్చి మురుగేష్‌పై కొడవలితో దాడి చేసి విచక్షణా రహితంగా నరికి చంపి పారిపోయారు. హత్యకు పరోక్షంగా సహకరించిన హనుమంతు (60), అతని భార్య వసంతమ్మ(56)లను మంగళవారం ఉదయం శాంతీపురం మండలం కలమడుగు పంచాయతీ పరిధిలోని తోపుచేనులో నివాసం ఉంటున్న వసంతమ్మ అక్క షర్మిల ఇంటి వద్ద అరెస్ట్ చేసినట్లు వలయాధికారి తెలిపారు. వారితో పాటు హత్యకు పాల్పడిన కమలేష్, కుమరేష్, మురుగేష్‌లను కూడా అక్కడే అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి కొడవలి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు భూపతి పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో గుడుపల్లి ఎస్సై భాస్కర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.