క్రైమ్/లీగల్

26వరకు అరెస్టు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కార్తి చిదంబరంకు మరికొన్ని రోజుల పాటు ఊరట లభించేలాగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేశాయి. ఈ కేసులో కార్తి చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 20వ తేదీ వరకు అరెస్టు చేయకూడదని ఢిల్లీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాల వర్తింపును మార్చి 22వ తేదీ వరకు పొడిగించింది. న్యాయమూర్తులు ఎస్.మురళీధర్, ఐఎస్ మెహతాలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణ తేదీని మార్చి 20 నుంచి 22కు మార్చింది. దీంతో కార్తి చిదంబరంను 22వ తేదీ వరకు అరెస్టు చేయకూడదని ధర్మాసనం గురువారం ఈడీని ఆదేశించింది. అయితే, కార్తి చిదంబరంకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ తాత్కాలిక ఉపశమనాన్ని తరువాత సుప్రీంకోర్టు ఈ నెల 26వరకు పొడిగించింది. ఈడీ నమోదు చేసిన ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కార్తి చిదంబరంను ఈ నెల 26వరకు అరెస్టు చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ 19పై దేశంలోని వివిధ హైకోర్టులు విభిన్నమైన దృక్పథాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్న కార్తి చిదంబరం కేసును తనంత తానుగా తనకు బదిలీ చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 26న ఈ కేసును విచారించనుంది. పీఎంఎల్‌ఏలోని సెక్షన్ 19 అమలుపై రేకెత్తిన ప్రశ్నలకు అత్యున్నత న్యాయస్థానం సమాధానం ఇవ్వనుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడయిన కార్తి చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన కేసు ఫలితంగా ప్రస్తుతం జైలులో ఉన్నారు.