క్రైమ్/లీగల్

ఇదేనా జర్నలిజం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: భాజపా అధ్యక్షుడి తనయుడు జెయ్ షా, ‘ది వైర్’ అనే న్యూస్ పోర్టల్‌పై వేసిన పరువునష్టం దావాపై, ఏప్రిల్ 12 వరకు ముందుకు పోవద్దని గుజరాత్ ట్రైల్ కోర్టును గురువారం ఆదేశించింది. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియాను చీవాట్లు పెట్టింది. ‘‘తమకు తోచిన విధంగా’’ ఏ వ్యక్తిపైనైనా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తారా? అంటూ ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ) దీపక్ మిశ్రా మీడియా ముఖ్యంగా టీవీ ఛానళ్లు, పోర్టల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక అధికారి/ప్రజాజీవనంలో ఉన్న వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం వాటిల్లజేసే రీతిలో కథనాలు అల్లుతారా?’’ అని ప్రశ్నించారు. తమకు ఏది తోస్తే అది రాసేయడమేనా? కొన్ని సందర్భాల్లో వీరు రాసే రాతలు తీవ్ర కోర్టు ధిక్కారం కిందికి వస్తాయి. జర్నలిజం అంటే ఇదేనా? ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంటూ సీజేఐ చీవాట్లు పెట్టారు. ‘‘నేనిక్కడ ఛానళ్ల పేర్లు ప్రస్తావించను, కానీ కొందరు తామే తీర్పరులమనుకుంటారు. ఇటువంటివారు తాము చేసిన దానికి తామే బాధ్యత వహించాలి. వీరిలో పరివర్తన రావాలి’’ అన్నారు.
కాగా ఇంకా ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎఎంఖాన్‌విల్కర్, జివై చంద్రచూడ్‌లు కూడా ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి రెండువారాల్లోగా స్పందించాలని ధర్మాసనం షా మరో పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. వీరు ‘ది వైర్’ పోర్టల్, కథనాన్ని రచించిన రోహిణీ సింగ్‌తో పాటు ఇతర జర్నలిస్టులపై పరువునష్టం దావా వేసారు. జర్నలిస్టుల తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, కథనంలో పేర్కొన్న వివరాలు రికార్డుల ఆధారంగానే ఉన్నాయన్నారు. నిజాలను రాసే జర్నలిస్టులపై ఈవిధంగా కేసులు వేయడం, జర్నలిజం పీక నొక్కేయడానికి ఉదాహరణ అన్నారు. దీనిపై షా తరపు న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ స్పందిస్తూ, రికార్డుల్లో ఉన్నదాంట్లో కొన్నింటిని మాత్రమే ఎంపికచేసి, తమకు అనుకూలంగా కథనాలు రాయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇది కేవలం కావాలని సృష్టించిన వివాదమన్నారు. షా తండ్రి రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉన్నందువల్లనే ఆయన్ను అపఖ్యాతి పాలు చేయడానికే ఈవిధమైన రాతలు రాసారన్నారు. దీనికి సిబల్ స్పందిస్తూ, మరి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంపై జరుగుతున్న దాడి కూడా అపఖ్యాతి పాలు చేయడానికేకదా అని అన్నారు.