క్రైమ్/లీగల్

అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 17 : అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్‌పి బి సత్యఏసుబాబు తెలిపారు. నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 31 కేసులు ఛేదించడంతోపాటు మొత్తం రూ.14 లక్షల చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్ సమావేశంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎస్‌పి అరెస్టయిన నేరస్తుల వివరాలు తెలియజేశారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన పొన్నూరు సత్యానందం, గుంటూరు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన మూలి ఫణిందర్‌రెడ్డి, గుంటూరు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన మోమిన్ సైదా, గుంటూరు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన పొదిలి జోజిబాబు నిందితులుగా ఉన్నట్లు ఎస్‌పి తెలిపారు. ఈ నలుగురు నిందితులను తన పర్యవేక్షణలో దర్శి ఇన్‌చార్జి డిఎస్‌పి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పొదిలి సిఐ కెఎస్ సిహెచ్ మీరాసాహెబ్, దొనకొండ ఎస్‌ఐ పి సుబ్బారావు, దొనకొండ సిబ్బంది కలిసి ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు దొనకొండ శివారు ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు 104 గ్రాములు, వెండి ఆభరణాలు 15 కేజీలు, రోల్డ్ గోల్డ్ తాళిబొట్టు చైను ఒకటి, రోల్డ్ గోల్డ్ నల్లపూసల తాడు ఒకటి, పిస్టల్ ఒకటి, పిస్టల్ బుల్లెట్స్ నాలుగు, కత్తి ఒకటి, మోటార్ సైకిళ్లు ఏడు..మొత్తం కలిపి రూ.14 లక్షలు విలుచేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. నిందితులు చేసిన నేరాల వివరాలను ఎస్‌పి తెలియజేస్తూ జిల్లాలోని యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో బంగారుషాపులో దొంగతనం, సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనం, అద్దంకి పోలీసుస్టేషన్ పరిధిలో సైకిల్ దొంగతనం, పుల్లల చెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారం షాపులో దొంగతనం, త్రిపురాంతకం పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నాచింగ్, దొనకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనం, దొనకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో (1బి) 27ఎ ఆర్‌ఎంఎస్ యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇవే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 24 నేరాలతో మొత్తం 31 నేరాలను అరెస్టయిన నిందితులు అంగీకరించారని ఎస్‌పి తెలిపారు. వీరు గతంలో గుంటూరు జిల్లాలో 15 కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఎస్‌పి తెలిపారు. అంతేకాకుండా విచారణలో వీరు గుంటూరు జిల్లాలో రెండు నేరాలు, కృష్ణా జిల్లాలో ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో 21 చోట్ల నేరాలు చేసి ఉన్నట్లు ఎస్‌పి సత్య ఏసుబాబు తెలిపారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన దర్శి ఇన్‌చార్జి డిఎస్‌పి వి శ్రీనివాసరావుతోపాటు పొదిలి సిఐ కెఎస్ సిహెచ్ మీరా సాహెబ్, దొనకొండ ఎస్‌ఐ పి సుబ్బారావు, దొనకొండ సిబ్బంది శ్రవణ్, వెంకటేశ్వర్లు, పెద్దకొండయ్య, చిన్నకొండయ్య, జనార్దన్, ఖాసిం, కరుణ్‌లను జిల్లా ఎస్‌పి బి సత్యఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు.