క్రైమ్/లీగల్

నిండు ప్రాణం బలిగొన్న మంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, జనవరి 17 : ఉదయం పూట దట్టంగా అలముకున్న పొగ మంచు ఒక వ్యక్తిని బలిగొంది. రోడ్డుపై పట్టిన మంచులో మోటార్‌బైక్‌పై వస్తున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లో బోల్తా కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిలో ఏల్చూరు సమీపంలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఏల్చూరు గ్రామానికి చెందిన నక్కా నెదరాములు ప్రకృతి వ్యవసాయంలో బల్లికురవ మండలం చెన్నపల్లి సెక్టారులో ముక్తేశ్వరం గ్రామానికి ఐసీఆర్‌పీగా పనిచేస్తున్నాడు. పెదరాములు ఉదయానే్న ముక్తేశ్వరంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సూచనలు ఇచ్చి 9 గంటల సమయంలో తిరిగి ఏల్చూరుకు బైక్‌పై వస్తున్నాడు. ఏల్చూరు కస్తూరిబా బాలికల విద్యాలయం సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై 10 అడుగుల దూరం కూడా కనిపించని విధంగా మంచు దట్టంగా ఉంది. బైక్ మంచులో నడుపుకుంటూ వస్తుండగా ఎదురుగా సమీపంలోకి వచ్చిన తరువాత ఒక వాహనం వస్తున్నట్లు గమనించి దాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డుమార్జిన్‌లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. బైక్ నడుపుతున్న పెదరాములు బైక్ కింద పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంచులో పడిపోయిన పెదరాములును ఎవరూ గమనించకపోవడంతో గంటపాటు బండి కిందే ఉండిపోయి అక్కడే తుదిశ్వాస విడిచాడు. అనంతరం బహిర్భూమికి వెళ్లిన కొందరు గమనించి కుటుంబ సబ్యులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న ఎస్సై వై నాగరాజు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బైక్ కింద పడి ఉన్న పెదరాములును బయటకు తీసి చూసేసరికి అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తంచారు. మృతదేహానికి పంచనామా చేసి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
వ్యవసాయశాఖ సిబ్బంది నివాళులు
ప్రకృతి వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ప్రమాదంలో అకాల మృత్యువాత పడిన పెదరాములు మృతదేహానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పలువురు, స్థానిక నేతలు నివాళులర్పించారు. నివాళులు అర్పించిన వారిలో బల్లికురవ ప్రకృతి వ్యవసాయ ఎన్‌ఎఫ్‌ఎఫ్ వినోద్‌కుమార్, పీఆర్‌పీ రామనాగాంజలి, సీఏ ప్రవీణతో పాటు సంతమాగులూరు సిబ్బంది సంతమాగులూరు నాయకులు, ఏల్చూరు వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడు దుద్దేల చినగాలయ్య, తాత్కాలికం సేసింగరాజు తదితరులు ఉన్నారు.