క్రైమ్/లీగల్

వరకట్న వేధింపులకు మరో అబల బలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జనవరి 17:స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా వరకట్నం దురాచారం సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. వరకట్న పిశాచికి ఇప్పటికే ఎందరో అతివలు బలయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం మండల పరిధిలోని పండ్లాపురం గ్రామంలో వివాహిత తన ఇద్దరు పిల్లలపై డీజిల్ పోసి నిప్పంటించిన సంఘటన ఇందుకు పరాకాష్ఠగా నిలిచింది. అదనపు కట్నం కోసం వేధించడం, వివాహితలను పుట్టింటికి పంపించివేయడం, వేధింపులకు గురి చేసి వారే వెళ్లిపోయేలా చేయడం లేదా ఏదోలా చంపి వేయడం జరుగుతోంది. పండ్లాపురానికి చెందిన వెంకటలక్ష్మమ్మను కూడా ఎంతో వేధించారని పుట్టింటికి వెళ్లిపొమ్మని బెదిరించారని, ఆమె సోదరుడు, వదిన వారింటికి వెళ్లి భర్త, పెద్దలతో మాట్లాడినా ఫలితం లేదని మరుసటి రోజుకే తమ సోదరి శవమైందని వాపోయాడు. అదనపు కట్నం తేవాలని, గర్భం తీయించుకోవాలని అత్తింటి వారు వత్తిడి చేయడంతో భరించలేక రాత్రి సమయంలో నిద్రిస్తుండగా అత్తింటివారు డీజిల్ చల్లి కిరాతకంగా కాల్చి చంపారని ఆరోపించాడు. తమకు సమాచారం తెలియగానే పండ్లాపురం వచ్చామని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. వివాహమై 15 సంవత్సరాలు అవుతున్నా, సంతానమైనా అదనపు కట్నం కోసం వేధింపులు మహిళలను దహించి వేస్తున్నాయి. మహిళల భద్రత కోసం ఎన్నో మహిళా సంఘాలు సమాజంలో పోరాడుతున్నా ఇలాంటి సంఘటనలు అడపాదడపా జరుగుతూనే వున్నాయి. ఇలాంటి సంఘటనలు బనగానపల్లెలో గతంలో కొన్ని చోటుచేసుకున్నా ఒకేసారి ముగ్గురు మృతి చెందడం అందరినీ కలచివేసింది. కావున పోలీసు, ఆయా శాఖల అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా సోదరుడు వెంకటాద్రి తెలిపిన ప్రకారం వివాహ సమయంలో అత్తింటి వారికి కట్న కానులు చెల్లించామని, అడపాదడపా తమ తల్లిదండ్రులు ఆర్థిక చేయూత అందిస్తూ వచ్చారని తెలిపాడు.