క్రైమ్/లీగల్

ఎదురు తిరిగిందని..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె: అత్తింటి ఆరళ్లకు కోడలు, ఇద్దరు చిన్నారులు బలయ్యారు. 15 ఏళ్లుగా ఆ కోడలికి అదనపు కట్నం వేధింపులు తప్పలేదు. మూడోసారి గర్భం దాల్చింది. దీంతో అత్తింటివారు ఆమెపై పగబట్టి గర్భం తీయించుకోవాలని ఒత్తిడి పెంచారు. దానికి ఆ తల్లి ససేమిరా అంది. దీంతో అంతా కలిసి నిద్రిస్తున్న తల్లీబిడ్డలపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో వెంకటలక్ష్మమ్మ(35), పవన్‌కుమార్(13), పావని(9) మంటల్లో కాలిపోయారు. హృదయవిదారకరమైన ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పండ్లాపురంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన గోవిందప్ప కుమార్తె వెంకటలక్ష్మమ్మ వివాహం బనగానపల్లె మండలం
పండ్లాపురం గ్రామానికి చెందిన శివరామయ్యతో 15 సంవత్సరాల క్రితం జరిగింది. పెళ్లయిన తరువాత వెంకటలక్ష్మమ్మకు వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలంటూ భర్త శివరామయ్య, అత్త లక్షమ్మ, మామ చిన్న లక్ష్మన్న వేధించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు పవన్‌కుమార్, పావని. తాజాగా వెంకటలక్ష్మమ్మ గర్భం దాల్చింది. పిల్లలు వద్దని, గర్భం తీయించుకోవాలని అత్తింటివారు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. కట్నం వేధింపులు భరించిన వెంకట లక్ష్మమ్మ గర్భం తీయించుకోనని తెగేసి చెప్పింది. తమకు ఎదురు తిరిగిందన్న కోపంతో కోడలని మట్టుబెట్టాలని అత్తింటివారు నిర్ణయించుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న వెంకటలక్ష్మమ్మ, పిల్లలు పవన్‌కుమార్, పావనిపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో తల్లీబిడ్డలు మంటల్లో కాలిపోయారు. వెంకటలక్ష్మమ్మ, ఇద్దరు చిన్నారులపై భర్త శివరామయ్య, అత్త లక్ష్మమ్మ, మామ చిన్న లక్ష్మన్న, మరిది రాజశేఖర్ డీజిల్ పోసి నిప్పంటించారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. మృతురాలు సోదరుడు కొట్టాల వెంకటాద్రి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈకేసులో వెంకటలక్ష్మమ్మ భర్త, అత్తామామలు, మరిదిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారన్నారు.