క్రైమ్/లీగల్

యానిమేషన్ సంస్థలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 17: షార్ట్ సర్క్యూట్‌తో మాదాపూర్‌లోని ఓ యానిమేషన్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఉద్యోగులు ఆ ఫ్లోర్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్ విఠల్‌రావు నగర్‌లోని నారాయణ మెన్షన్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఐదు, ఆరు అంతస్తుల్లో డిస్టిక్ ఆర్ట్ ప్రొటెక్షన్ యానిమేషన్ సంస్థ నడుస్తోంది. ఈ కంపెనీలో 150 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. భవనంలోని మిగిలిన అంతస్తులో కార్వీ సంస్థతో పాటు పలు కంపెనీలు ఉన్నాయి. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆరో అంతస్తులో నుంచి మంటలు రావడంతో ఉద్యోగులు పరుగులు పెట్టారు. నిముషాల వ్యవధిలో మంటలు భారీగా వ్యపించడంతో ఉద్యోగులు భయందోళన చెందారు. పోలీసులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందిచడంతో సకాలంలో వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రయాదం జరిగి ఉండవచ్చని అధికారులు చెప్పారు. ప్రమాదంలో రూ.10లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వర రావు తెలిపారు.