క్రైమ్/లీగల్

డీజిల్, పెట్రోల్ చోరీ ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జనవరి 17: డీజిల్, పెట్రోల్‌ను రహస్యంగా దొంగిలించి లక్షల రూపాయలు సంపాదించుకుని తప్పించుకుని తిరుగుతున్న అంతర్ రాష్ట్ర చోరీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ.90.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డీజిల్ ట్యాంకర్, కారు, మోటర్ సైకిల్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. హపీజ్ అజీజ్ చౌదరి, బిన్ని శ్రీనివాస్, మహ్మద్ అబ్దుల్ అబ్రార్, మరోజు జయకృష్ణతో పాటు మరో ఎనిమిది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఒక ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా డీజిల్, పెట్రోల్‌ను దొంగిలించి తప్పించుకుని తిరుగుతున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఓసీ, బీపీసీ (చర్లపెల్లి నుంచి ఘట్‌కేసర్) డీజిల్ పైపులైన్ నుంచి కొంత కాలంగా డీజిల్‌ను దొంగిలిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అంతర్ రాష్ట్ర మూఠాను అదుపులోకి తీసుకొని విచారించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఎనిమిది మందిని తొందరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. మూఠా సభ్యులను పట్టుకున్న పోలీస్ బృందాలను సీపీ అభినందించారు.