క్రైమ్/లీగల్

కిడారి, సవేరి హత్య కేసు నిందితులు కోర్టుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 17: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితులను ఎన్‌ఐఏ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అక్కడి పోలీసులు పలువురు నిందితులను గతంలో అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా జ్యుడీషియల్ రిమాండ్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు బదిలీ అయింది. దీంతో ఎన్‌ఐఏ అధికారులు తమ విచారణలో భాగంగా కోర్టు అనుమతితో నిందితులను గతంలో తమ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ ముగియడంతో వీరిని గురువారం విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కాగా నిందితుల్లో పలువురిని విచారించాల్సి ఉన్నందున తిరిగి కస్టడీ కోరుతూ ఎన్‌ఐఏ విజ్ఞప్తి మేరకు సుబ్బారావు, ఈశ్వరి, శోభన్ అనే ముగ్గురిని నాలుగురోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మిగిలిన ముగ్గురు నిందితులకు ఈ నెల 31 వరకు రిమాండు పొడిగించింది. దీంతో నిందితులను విశాఖపట్నం జైలుకు తరలించారు. ఇక కస్టడీకి అనుమతి మేరకు ముగ్గురి విచారణను ఎన్‌ఐఏ కొనసాగించనుంది.