క్రైమ్/లీగల్

కోడి పందాలపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 17: సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు సంప్రదాయ ముసుగులో సాగిన కోడి పందాలు, జూదక్రీడలపై పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 914 కేసులు నమోదు చేయటంతో పాటు 1561 మందిని అరెస్టు చేశారు. వీరి నుండి రూ.8లక్షల 32వేల 727లు నగదు, 452 కోడి పుంజులు, 420 కోతి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా 830 కేసుల్లో 1408 మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ, పోలీసు శాఖ సంయుక్తంగా కోడి పందాలు, పేకాట, చిత్తులాట, గుండాట వంటి జూద క్రీడల శిబిరాలపై దాడులు చేసినట్లు ఆయన తెలిపారు.