క్రైమ్/లీగల్

‘సాయ్’ డైరెక్టర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ ఒకరిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది. మొత్తం నలుగురిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు. సాయ్‌లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, భారీ మొత్తంలో నిధులు అన్యాక్రాంతం అవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో సీబీఐతో విచారణ జరిపిస్తున్నారు. విచారణలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నలుగురిని సీబీఐ అరెస్టు చేసింది. వారిని ప్రశ్నించిన తర్వాత, దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది. ఇలావుంటే, అవినీతిని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించబోమని, ఎంతటి స్థాయిలో ఉన్నాసరే, దోషులని తేలిన మరుక్షణం కఠిన చర్యలు తప్పవని సాయ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలం కపూర్ తెలిపారు. సీబీఐ విచారణతో అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణల్లో నిజానిజాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు.