క్రైమ్/లీగల్

ఢిల్లీలో ఉండలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత, ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన చర్యలను సరైన రీతిలో అమలుచేయడం లేదంటూ సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ ఓ గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయిందని, ఇక్కడ ఉండకపోవడమే మంచిదన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. వాయుకాలుష్యాన్ని నిరోధిం చే చర్యల అమలు సక్రమంగా జరగడం లేదని, అలాగే పెరిగిపోతున్న వాహనాల సంఖ్య కూడా ఆందోళనకరంగా మారిందని కోర్టు తెలిపింది. ఉదయం, సాయంత్రం అన్న తేడా లేకుండా ఇటు కాలుష్యం అటు మితిమీరిన ట్రాఫిక్ ఢిల్లీలో నిత్యకృత్యమైపోయాయని న్యాయమూర్తి అరుణ్‌మిశ్రా అన్నారు. వాయుకాలుష్యానికి సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మిశ్రా వ్యాఖ్యలు చేశారు. ‘్ఢల్లీలో ఉండ డం కష్టం. నేనిక్కడ స్థిరపడాలని అనుకోవడం లేదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వాయుకాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు జీవన హక్కునే దెబ్బతీస్తున్నాయని న్యాయమూర్తి దీపక్ గుప్తాతో కూడిన ఈ బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ఈరోజు ఉదయం నేను ట్రాఫిక్ చిక్కుకుపోయా ను. కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారానికి హాజరుకాగలనో లేనోనన్న ఆందోళన నన్ను కలచివేసింది’అని అని జస్టిస్ మిశ్రా అన్నారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారిందన్న మిశ్రా వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని ఈ కేసులో కోర్టు సహాయకుడిగా వ్యవహరిస్తున్న అపరాజిత సింగ్ అన్నారు.