క్రైమ్/లీగల్

సుప్రీం కోర్టు జడ్జిలుగా దినేష్ మహేశ్వరి, సంజయ్ ఖన్నా ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: జస్టిస్‌లు దినేష్ మహేశ్వరి, సంజయ్ ఖన్మా సుప్రీం కోర్టు జడ్జిలుగా శుక్రవారం ప్రమాణం చేశారు. సుప్రీం కోర్టులోని కోర్టు నెంబర్ వన్‌లో జరిగిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వారితో ప్రమాణం చేయించారు. వీరిద్దరి ప్రమాణంతో 31 మంది జడ్జిలు ఉండాల్సిన సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 28కి పెరిగింది. ఇంతకుముందు జస్టిస్ మహేశ్వరి కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వీరిద్దరినీ హైకోర్టు జడ్జిలుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ గొగోయ్, జస్టిస్‌లు ఏకే సిక్రీ, ఎస్‌ఏ బోబ్డే, ఎన్‌వి రమణ, అరుణ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు కొలీజియం ఈనెల 10న వీరిద్దరినీ సుప్రీం జడ్జిలుగా సిఫార్సు చేసింది. కాగా, రాజస్థాన్, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు ప్రదీప్ నంద్రజోగ్, , రాజేంద్రమీనన్‌లకు పదోన్నతి కల్పించాలని 2018, డిసెంబర్ 12న సుప్రీం కొలీజియం యోచించింది. అయితే కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ ఎంబీ లోకూర్ డిసెంబర్ 30న పదవీ విరమణ చేయడం, ఆయన స్థానంలో జస్టిస్ అరుణమిశ్రా రావడం వంటి పరిణామాల వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తర్వాత జనవరి 10న తిరిగి సమావేశమైన కొలీజియం వీరిద్దరినీ విస్మరించి మహేశ్వరి, సంజయ్‌ఖన్నాలకు సుప్రీం జడ్జిలుగా పదోన్నతి కల్పించింది. ఇలావుండగా, ఎంతో సీనియారిటీ ఉన్న జస్టిస్ ఖన్నాకు పదోన్నతి ఇవ్వకపోవడం పట్ల బార్ కౌన్సిల్ ఇండియా (బీసీఐ) విస్మయం వ్యక్తం చేసింది. కొలీజియం నిర్ణయం నిరంకుశం, చంచలమైనదంటూ విమర్శించింది. కొలీజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు జస్టిస్ కిషన్ కౌల్ చీఫ్ జస్టిస్, కొలీజియం సభ్యులకు ఒక లేఖ రాస్తూ ఎంతో సీనియారిటీ ఉన్న నంద్రజోగ్, మీనన్‌లను పదోన్నతిలో విస్మరించడం తగదని పేర్కొన్నారు. వీరిద్దరినీ పదోన్నతికి ఎంపిక చేయకపోవడం తప్పుడు సంకేతాలను పంపుతుందని, వీరు సీనియారిటీలో జస్టిస్ ఖన్నా కంటే ముందున్న విషయం మరువరాదని పేర్కొన్నారు.